Krishna has just returned to Dwaraka after the long Mahabharata War, and after
Dharma Raja's RaajyaabhiShEkam.
Each of his 16108 wifes is rejoicing, thoroughly convinced that her husband
has come first only to her house, showered the most love on her, etc.
పతి నాయింటికి మున్ను వచ్చె, నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా-
గతుడయ్యెన్ ...అప్పుడు కృష్ణుడు ఒక భామ ఇంటికి ముందు వెళితే
వేరొకతె లోఁ గుందునో, సుకరాలాపములాడదో, సొలయునో,
సుప్రీతి వీక్షింపదో అని శంకించి
ప్రకటాశ్చర్య విభూతిఁ జొచ్చె బహురూప వ్యక్తుడైఒకే సారి అందరి ఇళ్ళలో ప్రవేశించి,
వారిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు।
ఎలాగంటే,
సీసము:
తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి?
కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?
కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?
ఆటవెలది:
మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?
బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండుమనసెరిగి మాట్లాడడమంటే ఇదే!
ఏ భామకి దేనియందు మక్కువో గ్రహించి ఆమె taste ని ప్రశంసిస్తూనే
ప్రోత్సహిస్తున్నాడు, ధర్మం హెచ్చరిస్తున్నాడు।
ఇవన్నీ, మనసు నొచ్చుకోకుండా।
బంధుజనుల బ్రోతె బంధు చింతామణీ?
అనడంలో ఎక్కడా condescending attitude గాని,
హిత బోధ గాని, లేదు। ఇదే పద్ధతి శ్రీ రాముడు కూడా అవలంబిస్తాడు
రామాయణంలో, శబరిని పలుకరించేటప్పుడు
कच्चित् वर्धते तपह्?
"తపస్సు బాగా వృద్ధి అవుతోంది కదా!" అంటాడే గాని,
తపస్సు బాగా చేస్తున్నావా? (implying a moral class)
అని కాదు।
If we go into the meaning of the above sIsa padyam.
It is a thing of beauty in itself.
ఇంత శృంగారం ఒలికిస్తున్నా
తానుమాత్రం దానిలో జారిపోలేదు అనే ధ్వని
అచ్యుతుడు అనే శబ్దంలో ఉంది।
"అనుచు సతులనడిగె నచ్యుతుండు"
(అచ్యుతుడు = జారని వాడు)