Showing posts with label Memorize. Show all posts
Showing posts with label Memorize. Show all posts

Wednesday, August 28, 2013

Chain-like Poem

This poem is apparently in a style called mukta-pada-grastam (catching the tail of the previous word).
This is a poem on Krishna in a series called mukunda maala (by Sri Adi Shankara?).

उद्धृत-नग ! नगभिदनुज
दनुज-कुलामित्र ! मित्र-शशि-दृष्टे ! ।
दृष्टे भवति प्रभवति 
भवति किं भव-तिरस्कारः  ॥

 

 

Wednesday, November 30, 2011

Tongue Twister from గజేంద్ర మోక్షణం

అడిగెదనని కడు వడిఁ జను-
నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్
వెడవెడ చిడిముడి తడఁ బడ
నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

గజేంద్ర మోక్షణ ఘట్టం.
భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు.  లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు.  ఇది 'సర్వలఘు కంద పద్యం'.

`ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది.

పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

Wednesday, November 23, 2011

ప్రసిద్ధమైన 'ముక్కు' తిమ్మన పద్యం


నానా సూన వితాన వాసనలనానందించు సారంగమే-
లా నన్నొలదటంచు గంధఫలి బల్కాకన్ తపంబంది యో-
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్.

సారంగము = మధుకరీ = తుమ్మెద
నన్నొల్లదు = నన్ను స్వీకరించదు
గంధఫలి = సంపెంగ పూవు
బల్కాకన్ = పలు + కాకన్ = చాలా కొపంతో

What is the right age for philosophy?


దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా !

Who is the heaviest/strongest in the world?

Here is an excellent poem that builds up to a climactic answer.
I once explained it to a group of kids in Hyderabad, leading them through a bunch of questions to the answer. They loved it.

पृथ्वी शेषभृता, स शम्भुमकुटः, कैलासवासोप्यसौ
कैलासोऽपि दशाननेन तुलितः, बद्धोऽप्यसौ वालिना ।
वाली राघवविष्णुना युधिजितो, विष्णुः सतां मानसे
तस्माद्‌ विष्णुपरायणाद्‌ गुरुतरो नान्योऽस्ति लोकत्रये ॥

The question it pursues is, 'who is the heaviest/strongest in the world?'.
'The Earth', you say? But Adi Sesha is carrying the Earth on his hood.
Shambhu (Siva) wears him on his crown as an ornament to his locks. That makes it Shiva? Not yet.
Shiva is carried by Kailasa parvatam, which in turn was raised by Raavana.
Vaali carried Raavana in his armpit once upon a time and circled the entire globe.
Rama killed such Vaali with just a single arrow.


Such a valiant Rama, who is Vishnu himself, gets caged in the heart of his devoted bhakta.
 Hence the conclusion is, Vishnu bhakta is the strongest/heaviest of all, since he's carrying all the others mentioned so far in his heart. :-)

What is bhakti, but love?
Hence, love is the strongest force in the Universe as it keeps the most powerful in its control.

మనకి దేవుణ్ణి ఇలా అడిగే ధైర్యం ఉందా?

 ధూర్జటి కాళహస్తీశ్వర శతకం లోనిదిః

నిను సేవింపగనాపదల్ పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై-
గొననీ, జ్ఞానముఁ గల్గనీ గ్రహగతుల్ కుందింపనీ మేలు వ-
చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా !

Tuesday, November 22, 2011

Satyabhama Showing Viira and shringaara rasas together

పరుజూచున్, వరుజూచు నొంపనలరింపన్ రోష రాగోదయా-
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్, కన్నుల గెంపు సొంపు బరగన్ చండాస్త్ర సందోహమున్,
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలా గతిన్ ॥

From potana bhagavatam, narakaasura vadha.

DhurjaTi ridiculing the hankering after sons

కొడుకుల్ పుట్టరటంచునేడ్తురవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్
బడసెన్? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్?
చెడునే మోక్షపదంబపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా?

శబ్దం ద్వారా అర్థం

ప్రసిద్ధమైన అల్లసాని పెద్దన పద్యం:

అట జని కాంచె భూమిసురుడంబర-చుంబి శిరస్సరజ్ఝరీ-
పటల ముహుర్ముహుర్-లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన-
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్,
కటక చరత్ కరేణు కరకంపిత సాలము శీత శైలమున్

Quiz: Just read out the poem and tell me what it might be describing, without going into the meaning.

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి

అశోక వనంలో  హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:.

ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా-
పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే-
హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ-
ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్

ఆదర్శ  దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడా గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.

A Lilting Poem from Umaa Sahasram

This Samskrita sloka is part of a 1000-verse kaavyam on Goddess Uma composed extempore by kaavyakaNTha vaasiShTha gaNapati muni, the foremost disciple of Sri Ramana Maharshi. The entire kaavyam is available online at
http://surasa.net/uma

करोति या, बिभर्ति या, निहन्ति या जगत्त्रयं
समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या |
अतीव गुप्त-रूपिणी, गुरूपदेशमन्तरा
न शक्यते बुधैश्च बोद्धुमन्धकारि-सुन्दरी ||

This is especially suitable to teach kids, as they like the easily perceivable and fast rhythm of this sloka. It is same as that of 'मुदाकरात्त मोदकं'.

A Sloka from Kalidasa's beautiful dashashlokii stuti

Here is a great poem that you will enjoy only after you memorize it. Read it aloud. A beautiful musical rendering of the entire stuti can be found at  
Madugula Devii Stuti Maala on Surasa.net  

चेटी भवन् निखिल खेटी कदंबवन-वाटीषु नाकिपटली
कोटीर चारुतर-कोटी मणीकिरण-कोटी करंबित पदा |
पाटीर गन्धि कुचशाटी कवित्व परिपाटीम्-अगाधिप सुता
घोटी खुरादधिक धाटीम् उदार मुख वीटी रसेन तनुताम् ||
 
Word-by-Word Meanings
चेटी भवन् निखिल खेटी = being served by all the worlds(and their inhabitants; also sky-dwellers i.e., devas)  
करंबित पदा = having feet adorned by 
मणीकिरण-कोटी = millions of dazzling gems 
कोटीर चारुतर-कोटी = on millions of beautiful crowns 
नाकि-पटली = on the heads of a huge multitude of Gods  
पाटीर-गन्धि = sandalwood-smelling कुच-शाटी = breast-cloth (portion of saree covering the breasts) घोटी-खुरात् अधिक धाटीम् = A swifter gait than that of horse hooves 
मुख-वीटी रसेन तनुताम् = may she bestow with the betel juice in her mouth

First Ever Poem Composed by a Human

Valmiki is the first ever human being to compose a rhythmic poem set to a metre. Here is his poem:

मा निषाद ! प्रतिष्ठां त्वं अगमः शाश्वतीः समाः |
यत् क्रौञ्च-मिधुनाद्‌ एकं अवधीः काम-मोहितम् ||

Sunday, November 20, 2011

praasa vaibhavam

మెచ్చిన మచ్చిక గల్గిన
యిచ్చిన నీవచ్చు గాక యిచ్చ నొరులకున్
చిచ్చు కడి గొనగ వచ్చునె
చిచ్చర చూపచ్చు వడిన శివునకు దక్కన్ ?

పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి, కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి, నేర్చుకోవాలి.
అచ్చ తెలుగు పదాలతో నింపిన ఈ పోతన భాగవత పద్యం, హాలాహల భక్షణ అయిన తరువాత చెప్పబడినది.

మచ్చిక = ప్రేమ
ఇచ్చ = ఇష్టమయినది 
ఒరులకున్ = ఇతరులకి
చిచ్చు కడి = అగ్గి ముద్ద

కొనగవచ్చునె = తీసుకోవచ్చా ?
చిచ్చర చూపు = అగ్ని నేత్రం
అచ్చువడిన = stamp లాగా పడిన
శివునకు దక్కన్ = శివుడికి తప్ప

Monday, February 06, 2006

The liila (play) of baala Krishna

Why did Vyasa and pOtana write bhAgavatam? To sing and adore Krishna, the All-beautiful, through the souls of as many bhaktas as possible, nothing else.

Bhaagavatam is a chronicle of the ecstacy of Vyasa and pOtana as they entered diverse souls, each with his/her own background, and experienced their contact with the Divine.

In the following poem, Kunti, true to her motherly nature, recalls this beautiful childhood scene of Little Krishna and reconciles it with his reality as Divinity incarnate. She says this to Krishna after he saves pariikShit in uttara's womb from the brahmaastra of aSvatthaama.

kOpamu tODa nIvu dadhi kuMbhamu bhinnamu sEyuchunnachO
gOpika trATa gaTTina viku.nchita sA.njana bAShpa tOya dhA-
rA paripUrNa vaktramu karaMbula brAmuchu veccha-nUrchuchun.h
pApaDavai naTi.nchuTa kR^ipApara ! nA madi-jodyamayyeDin.h !!

కోపము తోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక త్రాట గట్టిన, వికుంచిత సాంజన బాష్ప తోయ ధా-
రా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చ నూర్చుచున్
పాపడవై నటించుట ! కృ్పాపర ! నా మది జోద్యమయ్యెడిన్ !

vikunchita vaktramu = chinnabOyina mukhamu
sA.njana baaShpa = sa + anjana (kannILLatO kATukantaa karigi pOyindi)
veccha nUrchuchun = vEDi niTTuurpulu viDustuu
chOdyamu = vinta (aaScharyamu)

Thursday, February 02, 2006

Sabda saundaryam

Here is a seemingly tough padyam (by today's standards) from pOtana's bhAgavatam.

A padyam is great if just by reading the padyam and hearing its rhythm and Sabdam (sound), we can feel its content even before understanding its literal meaning. Even if you don't know telugu well, just read it out aloud a couple of times until you get the words right, and then go on to my explanation. By the way, I use a transliteration scheme called ITRANS to write telugu language using english alphabet. When I get a Unicode editor, I'll post in telugu script.

The chhandas is called mattEbha vikriiDitam (the play of a matta+ibha = wild elephant):

vara gOvinda kathA sudhArasa mahA varShOru-dhArA paraM-
parala.n gAka budhEndra-chandra! yitarOpAyaanurakti.n pravis-
tara durdAnta duranta dussaha janussambhAvitaanEka dus-
tara gambhIra kaThOra kalmaSha kanaddaavaanalambArunE?

Saunaka and other sages are saying this to suuta, persuading him to tell them stories of govinda.
Just reading the poem will give you a feeling of how unbearable life without govinda chintana is, and how soothening listening to govinda's stories is.