Tuesday, March 21, 2006

శ్రీ కృష్ణుని రసికత, వాచాలత

Krishna has just returned to Dwaraka after the long Mahabharata War, and after
Dharma Raja's RaajyaabhiShEkam.

Each of his 16108 wifes is rejoicing, thoroughly convinced that her husband
has come first only to her house, showered the most love on her, etc.

పతి నాయింటికి మున్ను వచ్చె, నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా-

గతుడయ్యెన్ ...

అప్పుడు కృష్ణుడు ఒక భామ ఇంటికి ముందు వెళితే
వేరొకతె లోఁ గుందునో, సుకరాలాపములాడదో, సొలయునో,
సుప్రీతి వీక్షింపదో
అని శంకించి

ప్రకటాశ్చర్య విభూతిఁ జొచ్చె బహురూప వ్యక్తుడై
ఒకే సారి అందరి ఇళ్ళలో ప్రవేశించి,
వారిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు।
ఎలాగంటే,

సీసము:
తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి?
కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?
కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?

ఆటవెలది:
మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?
బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు
మనసెరిగి మాట్లాడడమంటే ఇదే!
ఏ భామకి దేనియందు మక్కువో గ్రహించి ఆమె taste ని ప్రశంసిస్తూనే
ప్రోత్సహిస్తున్నాడు, ధర్మం హెచ్చరిస్తున్నాడు।
ఇవన్నీ, మనసు నొచ్చుకోకుండా।
బంధుజనుల బ్రోతె బంధు చింతామణీ?
అనడంలో ఎక్కడా condescending attitude గాని,
హిత బోధ గాని, లేదు। ఇదే పద్ధతి శ్రీ రాముడు కూడా అవలంబిస్తాడు
రామాయణంలో, శబరిని పలుకరించేటప్పుడు
कच्चित् वर्धते तपह्?
"తపస్సు బాగా వృద్ధి అవుతోంది కదా!" అంటాడే గాని,
తపస్సు బాగా చేస్తున్నావా? (implying a moral class)
అని కాదు।

If we go into the meaning of the above sIsa padyam.
It is a thing of beauty in itself.

ఇంత శృంగారం ఒలికిస్తున్నా
తానుమాత్రం దానిలో జారిపోలేదు అనే ధ్వని
అచ్యుతుడు అనే శబ్దంలో ఉంది।
"అనుచు సతులనడిగె నచ్యుతుండు"
(అచ్యుతుడు = జారని వాడు)

10 comments:

oremuna said...

Thank you for sharing this.

As usual I will try to keep the sanskrit one at the similar place :)

Sriram said...

chAla manci padyam...mee blog chAla bAgundi.

Anonymous said...

meeku ee pustakaalu ekkada dorukutunnayi? esp. srimadramayana kalpavrksham etc. india lo teesukuni unte, ekkado cheppagalaru. Thanks.

Anonymous said...

levu sarattamasvinulu, levu manojna sudhamsumalikal,vevu vineela nirmala kalinda suta nava natya sampadal, levu madeeya gatra lavalin pulakamkurakorakaavalul, levu kumaragopa muralee mrudu geeta jharee ninaadamul.

ide modatisaari ravatam.in tha manchi blog kaani evvaroo participate cheyyaru. meeru chestunna ee paniki bhagavanthudu sarvada sarvadha todupadaalani aakankshistoo

Bhavadeeyudu

Venkatkanada@yahoo.com

రానారె said...

ఈ సీస పద్యాన్ని మరో రూపంలో చూశాం పోతన భాగవతంలో. అదే పోలిక ఉన్న ఈ పద్యాన్ని రాసినదెవరు?

అన్నట్టు, సురస డాట్ నెట్ మీదేకదండి?

Anonymous said...

ఎందుకాపేశారు ఈ బ్లాగు. మంచి బ్లాగులా ఉన్నది. పునః ప్రారంభించండి... దయచేసి...

Anonymous said...

evaridaMDi I padyaM?

Anonymous said...

Mee posts chala bagunnayi. Ippudu enduku manesaru?

Naaku bharatam loni padyalu "Chellio Chellako", "Janda pai kapi raju" inka migilina Telugu padyala artham kuda kavali. Koncham sheppa galara.

Alage inka emi ayina manchi links kuda add cheya galara mee posts lo?

I will keep checking on rss.

Once more, Thanks.

Anonymous said...

VERY VERY GOOD BLOG
_Subrahmanyam

Sandeep P said...

Sai gaaru

meeru ee madhyana blaagu cheyyaTlEdEmiTanDi? dayachEsi konasaaginchanDi.