మెచ్చిన మచ్చిక గల్గిన
యిచ్చిన నీవచ్చు గాక యిచ్చ నొరులకున్
చిచ్చు కడి గొనగ వచ్చునె
చిచ్చర చూపచ్చు వడిన శివునకు దక్కన్ ?
పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి, కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి, నేర్చుకోవాలి.
అచ్చ తెలుగు పదాలతో నింపిన ఈ పోతన భాగవత పద్యం, హాలాహల భక్షణ అయిన తరువాత చెప్పబడినది.
మచ్చిక = ప్రేమ
ఇచ్చ = ఇష్టమయినది
ఒరులకున్ = ఇతరులకి
చిచ్చు కడి = అగ్గి ముద్ద
కొనగవచ్చునె = తీసుకోవచ్చా ?
చిచ్చర చూపు = అగ్ని నేత్రం
అచ్చువడిన = stamp లాగా పడిన
శివునకు దక్కన్ = శివుడికి తప్ప

No comments:
Post a Comment