నానా సూన వితాన వాసనలనానందించు సారంగమే-
లా నన్నొలదటంచు గంధఫలి బల్కాకన్ తపంబంది యో-
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్.
సారంగము = మధుకరీ = తుమ్మెద
నన్నొల్లదు = నన్ను స్వీకరించదు
గంధఫలి = సంపెంగ పూవు
బల్కాకన్ = పలు + కాకన్ = చాలా కొపంతో
3 comments:
It is not Timmana`s poem. it is in `vasu charitra` of Ramaraja Bhushana.
గంధఫలి అంటే సంపెంగ మొగ్గ ఏమో కదా..!
అలా అనుకుంటేనే అర్థవంతంగా ఉన్నట్లుంది కదూ..!
You are right about సంపెంగ.
It was a typing mistake on my part.
Also, yes, this is not by timmana but it became famous has his poem. So states Sri Betavolu Ramabrahmam in his padya kavitaa parichayam book.
Post a Comment