Wednesday, November 30, 2011

Tongue Twister from గజేంద్ర మోక్షణం

అడిగెదనని కడు వడిఁ జను-
నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్
వెడవెడ చిడిముడి తడఁ బడ
నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

గజేంద్ర మోక్షణ ఘట్టం.
భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు.  లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు.  ఇది 'సర్వలఘు కంద పద్యం'.

`ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది.

పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

4 comments:

Unknown said...

Thank you sai garu

Unknown said...

Thanks sai garu
maa telugu sir gurthuku vaccharu
ee padyam vinna tarvataa..

Anonymous said...

mithramaa. namasthey. ee seershikalo meeru 'gajendra mokshanam' ani thappugaa vraasaaru. dhaanini 'gajendra moksham' gaa savarinchagalaru. mee aasayam chaala baagundi. very good.

subhaakankshalato
mee k.s.kumar
kumarskuppa@rediffmail.com

Sai Susarla said...

అది గజేంద్ర మోక్షణమేనండి. మోక్షణమంటే విముక్తి చేయుట అని అర్థం. మోక్షం అంటే ముక్తి పొందుట. మోక్షణమంటే ముక్తి కలిగించుట (ఇతరులకి).
- సాయి.